గురువాక్యసుథ





"నాకు ఇదే ఆఖరి జన్మ, ఇక మళ్ళీ పుట్టటం అనే సమస్యే లేదు" 
అని తెలిసి చెప్పిన గురువుల చెంత వున్నాం మనం.

100 Apple Companies, 1000 Google Companies, 10000 Fortune-500స్థాయి Companiesకి అధిపతివైనా నీకీభాగ్యం కలగుటకల్లే. నీవు ఒక దేశ ప్రధానివి ఐనా, లేక ఐక్యరాజ్యసమితికి అధ్యక్షుడివైనా ''మరుజన్మము లేని నిజవిద్యను బోధించెడి నిజగురు'' ఉనికిని వారి కృప లేనిదే గుర్తించ నేరవు.

సత్సంగం అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్తాం. 
సత్సంగత్వము > నిస్సంగత్వము > నిర్మోహత్వము > నిశ్చలతత్త్వము > ఆపై జీవన్ముక్తి అని.  కానీ మనం ఇప్పుడు ఈ stages లో ఎక్కడున్నాం అని ఎవరికి వారు స్వాధ్యయనము, ఆత్మపరిశీలన చేసుకొనవలసిన తరుణమిది.
క్షీణమాయుః క్షణే క్షణే కర్తవ్యం సద్గురువును ఆంతర్యంలో ఆశ్రయించటమే.

-----------------------------------------------------------------------------
8, 9 ఏండ్ల క్రితం విద్యాసాగర్‌ గారు చలపల్లి సత్సంగానికి వచ్చారు. తలకి భారీ మఫ్లర్‌, వంటికి భారీ కంబళీ కప్పుకుని. నేను Shock. ఆ స్వరంలో చూపులో ధీశక్తిలో ఏవిధమైన తేడా లేదు. కేవలం శరీరానికి బలమైన బట్టలు చుట్టారు. 

నేను అడిగాడు అయ్యా! తమరిని ఇలా చూడటం నాకు నమ్మశక్యముగా లేదు. నేను చూచుచున్నది నిజమా? అబద్ధమా అని ఏదోలా వుంది అని.

వారు ఆఫీసులో సెలవు చీటి ఇవ్వడానికో లేక మరే ఇతర ఆఫీసు కార్య నిమిత్తమై వచ్చారు. పోనీ వచ్చిన వారు వళ్ళు కదలకుండా వెళ్తారా అనుకుంటే, చల్లపల్లి నుంచి మఛలీపట్నం, అదీ ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేయబోతున్నారు. నేను మా సత్సంగం నుంచి వారితో పాటు, బస్సులు ఆగే చోటు వరకు వెళ్ళాను. 

నా మనసులో అలజడి తెలిసి, వారు ఒక్కటే మాట అన్నారు.

"వృద్ధి క్షయములు, జరా వ్యాధులు శరీరమునకు సహజములు కదా!" అని
ఆ నాలుగు రోడ్ల కూడలిలో దేనిని పట్టించుకోకుండా ఉన్నపళంగా ఆయన కాళ్ళమీద పడాలనిపించింది. కానీ అపని చేయలేదప్పుడు. 
ఆశ్చర్యంలో మునిగి పోయాను. అంతే!
-----------------------------------------------------------------------------
మిత్రులారా! నేనే కాదు అందరం కూడా ఇదే స్థితిలో పొరబడుతున్నాం. కాళ్ళమీద పడటం, పాద నమస్కారాలు ఇవి భౌతిక ఆశ్రయానికి చిహ్నాలు.
(అశరీరిగావున్న) సశరీర గురుమూర్తులను భౌతికంగా ఆశ్రయించాలను కోవడం వివేక హీనతే. వారిని భౌతికంగా కాక, మానసికముగా ఆశ్రయించాలి. ఒక వేళ నేను ఆ రోజు ఆయన కాళ్ళ మీద పడివుంటే, ఆ సంఘటన స్ఫురణకు కాదు కదా, కనీసము జ్ఞప్తిలో కూడా వుండేదో లేదో, అదే మానసిక ఆశ్రయించిన ఆ గురుస్ఫూర్తి గురువాక్యశక్తి మనం కడతేరేవరకు, మనల్ని కడతేర్చేవరకు వీడవు. 
-----------------------------------------------------------------------------

అలానే బస్సు వచ్చింది. మేం మాట్లాడుతూ బస్సులాగే చోటికి కొద్ది దూరంలో వుండడం చేత ఓ బస్సు ఎక్కాలంటే కొంత పరిశ్రమ (RUN) చేయాలి. కానీ స్వామి అన్నారు, నువ్వు నీ కాలేజీ నిమిత్తము running bus ఎక్కేందుకు సంశయించవు, కానీ మేం ఏనాడూ ఆ పని చేయము, 'కారణం విచారించు' అని చెప్పి వేరే బస్సు ఎక్కి వెళ్ళారు. వారు పేరుకు వెళ్ళారనే కానీ నా మనసులో కొలువై పోయారు, ఆ రోడ్‌లో ఎన్ని కుదుపులు వుంటాయి, అసలే వళ్ళు బాలేదు, ఇప్పుడు కదిలితే అది రెట్టింపు అవదా, 'అన్నీ జీవ భావాలే'... 

-----------------------------------------------------------------------------
నాకు మొన్న ఆ మధ్య విపరీతమైన చలిజ్వరం వచ్చింది. అర్థరాత్రి గజ గజ గజ వణికి పోతున్నా. అమర్‌నాథ్‌ వెళ్ళినప్పుడు మంచు మీద కూర్చున్నప్పుడు కూడా ఇంత చలి అనిపించలేదు. 
ఈ తరుణంలో వారు ఆనాడు చెప్పిన గురువాక్యం స్ఫరించింది. 
"వృద్ధి క్షయములు, జరా వ్యాధులు శరీరమునకు సహజములు కదా!" 
అంతే దుప్పటి గిప్పటి అన్నీ పక్కన పెట్టి పద్మాసనంలో కూర్చున్నా... 
చలి, గిలి అన్నీ శివ శివ అని శివరాత్రికి వెళ్ళి పోయినట్లుగా వదిలిపోయాయి. 
తరువాత దీనిపై దృష్టి పెట్టాను.

స్వామి! సాధన యందు స్థిరత్వం పొందటం ఎలా ?

శరీరానికి  హిత,  మిత   ఆహారం 
ప్రాణానికి  సమ స్థితిలో  ప్రాణాయామం 
మనస్సుకి  జపం 
బుద్ధికి  ధ్యానం 
చిత్తానికి  ఆత్మ విచారణ 
అహంకార  నిరసనకి  వైరాగ్యం,
ఆత్మనిష్ఠకి  తీవ్ర మోక్షేచ్చ , శరణాగతి.
ఇవే  ఎన్ని  చదివినా చేయ వలసిన జీవనం. 
ఈశ్వరునిపై  గురువుపై  వున్న విశ్వాసం నడిపిస్తుంది. 
'తహ' దారి చూపుతుంది. 
స్వాత్మ అనుగ్రహం అనుభూతి నిస్తుంది.
((స్వాత్మ అనుగ్రహం అంటే.. నీ లోని అంతర్యామిని అనుసరించి జీవించటం, 
యిది  త్రికరణశుద్ధి  వున్నవారికే!))

గురువాక్యశక్తి ఎట్టిదనిన, సరిగ్గా నీ ప్రయాణంలో ఆ స్థితికి నీవు చేరినప్పుడు నీకు స్ఫురణ రూపంలో తోడై నిలచి,  నిన్నుముందుకు నడుపుతుంది.
ఇక్కడ కొలువుకాబడిన గురువాక్యసుథను సాధకులంతా గ్రోలెదరని ఆశిస్తూ...


ఓం తత్‌ సత్‌
ఓం శాంతిః శాంతిః శాంతిః